మీరు ప్రార్ధించేటప్పుడు దేవుడు వింటాడు

మీరు ప్రార్ధించేటప్పుడు దేవుడు వింటాడు

యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును. (కీర్తనలు 6:8–9)

దావీదు వ్రాసిన ఈరోజు వచనముల ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన ప్రార్ధనను ఆలకిస్తాడు మరియు ఆయన సమాధానం ఇస్తాడు. దేవుడు మీ పక్షాన ఉన్నాడని మరియు జీవితంలో మీ పోరాటాలను గెలవడానికి ఆయన మీకు సహాయం చేస్తాడని మీకు తెలిసినంత వరకు మీరు ఆత్మవిశ్వాసంతో జీవించగలరు మరియు మనము వాటిని గురించి నమ్మకంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఒంటరివారు కాదు, దేవుడు మీతో ఉన్నాడు!

కీర్తనలు చదవడం దేవుని నుండి వినడానికి గొప్ప మార్గం. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మరియు కీర్తనలు ముఖ్యంగా కష్ట సమయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీరు వాటిని చదివేటప్పుడు, వాటిని వ్యక్తిగతంగా తీసుకోండి. అవి వేరొకరి కోసం ఉన్నట్లు వాటిని ధ్యానించవద్దు, కానీ అవి మీకు దేవుని వ్యక్తిగత లేఖ అని గుర్తుంచుకోండి. ఆయన మీ కోసం మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడని మరియు మీకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా, ఆయన మీ కోసం ఉన్నాడని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు దావీదును అతని శత్రువుల నుండి విడిపించాడు మరియు మీరు ఆయనపై నమ్మకంగా ఉంటే ఆయన మీ కోసం అదే పని చేస్తాడు.

సమాధానముతో ఉండండి మరియు మీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. దేవుడు నిన్ను మరచిపోలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఆయన మీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేయడు. ఆయన తొందరగా ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేయడు! మీ దర్శనమును మీ ముందు ఉంచండి మరియు వదులుకోవద్దు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుడు మీకు సహాయం పంపును; ఆయన సహాయకారిగా ఉంటాడు, ఉపశమనం కలిగిస్తాడు మరియు మిమ్మును బలపరుస్తాడు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon