అయినను వీటినన్నిటిని (వరములు, సామర్ధ్యములు) ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. —1 కొరింథీ 12:11
ప్రజలు దేవుడు వారికి ఇచ్చిన బహుమతులు ఎలా కనుగొనాలి మరియు ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అని నన్ను అడుగుతారు. ఇక్కడ నేను కనుగొన్న కొన్ని ఉపయోగకరమైన దశలు ఉన్నాయి:
- దేవుడు మీకు ఇచ్చిన శక్తి పై (బలము) దృష్టి పెట్టండి. నీ శక్తి (బలము) మీద ఏకాగ్రత నిలిపితే దేవుడు నీ జీవితంలోని నీ పిలుపును నెరవేరుస్తాడు.
- మీ వరములను అభ్యాసం చేయండి. మీరు చేయాలనుకుంటున్న బాగా ఇష్టపడే దానిని కనుగొని, మరలా మరలా చేయండి. ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఓడిపోతున్న అనుభూతి లేనందున మీరు దీనిని గురించి బాగా ఆనందిస్తారు.
- భిన్నంగా ఉండునట్లు ధైర్యం కలిగి యుండండి. మీరు ఏకైక వ్యక్తిగా ఉండాలనే ఆలోచనను హత్తుకోకుండా ఇతరుల వలె ఉండుటకు ప్రయాత్నిస్తే మీలో ఆ సంతోషం వస్తుంది.
- విమర్శలను అధిగమించడం నేర్చుకోండి. మీరు క్రీస్తులో ఉన్నవారైతే ఇతరులు చెప్పేది వినగలరు మరియు మీరు వారి భావనను అంగీకరిస్తారు లేదా వారి ఆమోదం పొందాలనే భావన లేకుండా మార్చడానికి ముందుకు వస్తారు.
దేవుడు మీలో గొప్పతనాన్ని నాటి యున్నాడు. ఈ రోజు మీకు గొప్ప సాహసోపేత ప్రారంభాన్ని తెలపండి మరియు ఆయన మీకు ఇచ్చిన వరములను ఉపయోగించుకోండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు నాకు ఇచ్చిన వరములను ఉపయోగించి వాటిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుసరించడానికి ధైర్యం ఇవ్వండి మరియు వరములను మరియు సామర్ధ్యాలను అభివృద్ధి పరచండి.