
శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయముల మీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము —రోమా 8:5
విశ్వాసులముగా, సరియైన ఆలోచన చాల ప్రాముఖ్యమైనది ఎందుకనగా అది లేకుండా మనము జీవించలేము. కేవలం మన హృదయ స్పందన వలె, మనము మన జీవితాలలో ఎదుర్కొనే తప్పుడు ఆలోచనా పద్ధతులు, సత్యము మీద ఆధారపడవు.
సరియైన ఆలోచన అనునది ప్రార్ధన మరియు వాక్యము ద్వారా దేవునితో మనము కలిగి యుండే వ్యక్తిగత సహవాసము యొక్క ఫలితమే. మన ఆలోచనలు ఫలములను ఫలిస్తాయి కాబట్టి మన ఆలోచన క్రమపరచబడేంత వరకు మన జీవితాలు క్రమముగా ఉండవు అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మరియు నేను మంచి ఆలోచనలు కలిగి యున్నప్పుడు, మన జీవితాలు మంచి ఫలాలను ఇస్తాయి. చెడు ఆలోచనలు ఆలోచించినప్పుడు, మన జీవితాలు చెడు ఫలాలను ఇస్తాయి.
నేను ఎంతకాలం దేవుని సేవ చేస్తానో మరియు ఆయన వాక్యాన్ని అధ్యయనం చేస్తానో, అంతకాలం నా మనస్సులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నేను గ్రహించాను. మనస్సు ఎటు వెళ్తే దానిని, మనిషి అనుసరిస్తాడు. మన ఆలోచనలను నిరంతరం గమనించడం అనేది మనం వాటిని దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంచడానికి మరియు శత్రువుపై మన యుద్ధంలో విజయం సాధించగల ఏకైక మార్గం.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మా, మీరు ఆ యదార్ధమైన ఆలోచన పూర్తిగా ప్రాముఖ్యమైనదని మీరు నాకు చూపించి యున్నారు. నేను క్రమముగా మిమ్మును వెదకుచున్నాను మరియు మీ వాక్యమును అధ్యయనం చేయుచున్నాను తద్వారా నేను సరియైన ఆలోచనలను చేయగలను.