యేసులో మనము కలిగియున్న విజయము

యేసులో మనము కలిగియున్న విజయము

దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. – హెబ్రీ 2:9  

యేసు మన కొరకు మరణమును అనుభవించి యున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీవు మరియు నేను నిత్య మరణమును అనుభవించ వలసిన అవసరం లేదు ఎందుకంటే మన పాపము కొరకు అయన వెల చెల్లించి మనకు నిత్య జీవమనే వరమును అనుగ్రహించి యున్నాడు. ఇప్పుడు మనము దానిని గురించి ఆనందించవలసిన వారమై యున్నాము!

మరణము మీద క్రీస్తు యొక్క పునరుద్ధానము మరియు విజయము వలన ప్రతి నూతన ఉదయమున మనము క్రీస్తులో కలిగియున్న విజయములో జీవించుట అనునది ఒక నూతన అనుభవమైయున్నది. క్రైస్తవులు ఉదయమున వారి కాలు భూమి మీద మోపినప్పుడు నరకము వణకుతుంది. మనము ఉదయమున మేల్కొన్నామని గుర్తించగానే సాతాను సమూహము వణికి పోతుంది!

క్రీస్తులో మనమేమై యున్నామనే విషయమును మరియు ఆయనలో మనము కలిగియున్న అధికారమును మనము గ్రహించినప్పుడు మాత్రమే అది ఖచ్చితముగా సంభవిస్తుంది. మనము దేవుని సైన్యములో సైనికులమై యున్నాము. మనము ఆయనలో అధికారమును కలిగి యున్నాము!

యేసు పాపము మరియు మరణమును ఓడించి యున్నాడు. ఇప్పుడు దేవుడు మన కొరకు ఏర్పరచిన అధికారము మరియు విజయములో స్థిరముగా నడవవలసి యున్నది. అప్పుడే మనము దేవుని శత్రువుని అపాయములో పడవేయగలము!

ప్రారంభ ప్రార్థన

దేవా, మీలో నేను కలిగియున్న విజయమును బట్టి వందనములు. ప్రతి దినము, నా కొరకు మీరు చెల్లించిన వెలను అర్ధం చేసుకోనునట్లు నాకు సహాయం చేయండి, తద్వారా మీరు నా కొరకు కలిగియున్న అధికారము మరియు విజయములో నడవగలను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon