లేమి అనే భయమును జయించుట

లేమి అనే భయమును జయించుట

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.  —ఫిలిప్పి 4:19

ప్రజలు ఎదుర్కొనే ఒక గొప్ప భయము ఏదనగా లేమి అనే భయము. మీ అవసరతలు తీర్చబడవేమో అనే భయము – మీ వనరులు కోల్పోయినప్పుడు దేవుడు మీ అవసరతలలో సహాయమునకు రాడేమో అనే భయము.

మీరు ఇంతకు ముందెన్నడూ లేని లేమిని మీరు అనుభవిస్తూ ఉండవచ్చు, ఆర్ధిక విషయాల్లో అత్యవసర పరిస్థితిలో లేక ఇతర భయాలు ఉండవచ్చు. లేక మీరు ఉద్రేకపరమైన లేక ఆత్మీయ లేమిని కలిగి యుండవచ్చు. భయమనే ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుండవచ్చు, మరియు దేవుడు మీ అవసరతలను తీర్చడు లేక మీరు కూడా ఏమి చేయలేరని మీకు చెప్తూ ఉండవచ్చు.

మీ శత్రువు ఒక అబద్దీకుడని మీరు ఈరోజు తెలుసుకొనవలసియున్నది మరియు దేవుడు మీ పరిస్థితిని గురించి శ్రద్ధ కలిగి యున్నాడు. ఆయన ఒక ప్రణాళికను కలిగి యున్నాడు మరియు తగిన సమయంలో ఆయన మీకు సహాయం చేయునట్లు ఆయన దానిలో పని చేస్తూ ఉన్నాడు.  మీ మార్గములో ఏదియు రాదని మీకు అనిపించినా అద్భుతముగా ఎలా మీకు సహాయపడగలడనే  విషయాన్ని దేవుడు ఎరిగియున్నాడు.

మీ అవసరతలు ఎవైనప్పటికీ-ఆర్ధిక, శారీరక, ఉద్రేకపరమైన, ఆత్మీయ అవసరత ఏదైనా కావచ్చు – మీరు లేమీ యనే భయమును కలిగి యుండవలసిన అవసరం లేదు. దేవుడు మీ కొరకు సమస్తమును అనుగ్రహించును, ఆదరించును, పోషించును మరియు బలమనే స్థానమునకు మిమ్మును తీసుకొని వచ్చును. ఆయన అనుగ్రహములో నమ్మిక యుంచుము.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు నా ప్రతి అవసరమును తీర్చుదురని నీ వాక్యము సెలవిస్తుంది, కాబట్టి లేమియనే భయమును నేను కలిగి యుండను. మీరు నన్ను ప్రేమిస్తున్నారని మరియు మీరు వచ్చి నాకు సమస్తమును అనుగ్రహిస్తారని నేను నమ్ముచున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon