అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. (కీర్తనలు 45:13)
క్రిస్మసు కాలములో, డిపార్ట్‌మెంట్ స్టోర్ కిటికీలు తరచుగా అందంగా కట్టబడిన పరదాలతో ప్రకాశవంతమైన, మెరిసే బహుమతులను కలిగి ఉంటాయి. ఈ బహుమతులు చాలా బాగున్నాయని అనిపించవచ్చు, కానీ మనం వాటిని తెరిస్తే, లోపల ఏమీ కనిపించదు. అవి “షో” కోసం ఖాళీగా ఉన్నాయి. మన జీవితాలు అదే విధంగా ఉంటాయి, లోపల విలువ లేకుండా అందంగా చుట్టబడిన ప్యాకేజీల వలె కనపడతాయి. బయటికి, మన జీవితాలు ఇతరులకు ఆకర్షణీయంగా లేదా అసూయపడేలా కనిపించవచ్చు, కానీ లోపల మనం ఎండిపోయినట్లు మరియు ఖాళీగా ఉండవచ్చు. మనం బయటికి ఆత్మీయముగా కనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మను మన హృదయాలలో తన నివాసం చేసుకోవడానికి మనం అనుమతించకపోతే లోపల శక్తిహీనులుగా ఉంటాము.
ఈరోజు వచనం అంతరంగ జీవితం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మన అంతర్గత జీవితాలపై-మన వైఖరులు, మన ప్రతిస్పందనలు, మన ప్రేరణలు, మన ప్రాధాన్యతలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై పని చేయడానికి దేవుడు మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. మన అంతరంగములో క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నట్లైతే, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహిస్తాము మరియు సమృద్ధిగా జీవించడానికి మనల్ని శక్తివంతం చేయడానికి ఆయన నీతిని, సమాధానము మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనలో నుండి పైకి ఉద్భవిస్తాయి (రోమీయులకు 14:17 చూడండి).
మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన సన్నిధి మరియు నడిపింపుతో నింపు క్రీస్తువలే మనల్ని మార్చును, కాబట్టి మనం ఇతరులతో పంచుకోవడానికి ఏదైనా కలిగి ఉంటాము, అది మన జీవము యొక్క అంతర్భాగంలో నుండి వచ్చినది మరియు విలువైనది, శక్తివంతమైనది, మరియు తద్వారా మనం సంభాషించే ప్రతి ఒక్కరికీ జీవితాన్ని ఇవ్వడ గలుగుతాము.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ వెలుపలి జీవితము మీద కంటే మీ అంతరంగ జీవితము మీద దృష్టి నుంచండి.