నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. (సామెతలు 4:23)
వైఖరి చాలా ముఖ్యం; మన వైఖరులు మనం ప్రదర్శించే ప్రవర్తనగా మారతాయి. దృక్పథం, మంచి లేదా చెడు, ఆలోచనలతో ప్రారంభమవుతుంది.
ఒక ప్రసిద్ధ కొటేషన్ ఇలా చెబుతోంది, “ఆలోచనను విత్తండి, ఒక క్రియను కోయండి; ఒక చర్యను విత్తండి, అలవాటును కోయండి; ఒక అలవాటును విత్తండి, ఒక గుణాలక్షణమును కోయండి; ఒక గుణ లక్షణమును విత్తండి, గమ్యమును పొందండి.”
గమ్యం అనేది జీవితం యొక్క ఫలితం; మనమేమైయున్నమో అదే మన గుణలక్షణం అంటే మనం; అలవాట్లు ప్రవర్తన యొక్క ఉపచేతన నమూనాలు. మన విధి లేదా మన జీవితాల ఫలితం వాస్తవానికి మన ఆలోచనల నుండి వస్తుంది. అక్కడే మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త వైఖరులు మరియు ఆదర్శాలను అభివృద్ధి చేస్తూ, మన మనస్సులను పూర్తిగా పునరుద్ధరించుకోవాలని బైబిల్ మనకు బోధించడంలో ఆశ్చర్యం లేదు (రోమీయులకు 12:2; ఎఫెసీయులు 4:23 చూడండి). మనం దేవుని వాక్యానికి మంచి విద్యార్థులుగా ఉండాలి మరియు దాని ద్వారా కొత్త ఆలోచనా విధానాలను అభివృద్ధి చేసుకోవాలి, ఇది చివరికి మన మొత్తం విధిని, మన జీవిత ఫలితాన్ని మారుస్తుంది.
ద్వేషం, కోపం, క్షమించకపోవడం, నీచమైన స్వభావం, అగౌరవం, ప్రతీకారం తీర్చుకోవడం లేదా కృతజ్ఞత చూపకపోవడం వంటి చెడు వైఖరుల జాబితాతో మనం పరిశుద్ధాత్మను అడ్డుకోవచ్చు. పరిశుద్ధాత్మ దైవిక వైఖరి ద్వారా ప్రవహిస్తుంది, భక్తిహీనతతొ కాదు.
ఈరోజు వచనం మాట్లాడినట్లుగా, మీ వైఖరిని క్రమం తప్పకుండా పరిశీలించండి మరియు శ్రద్ధతో దానిని కాపాడుకోండి. మీరు మీ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటే; మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచనలను మార్చుకోవడం.
సాతాను ఎల్లప్పుడూ మన మనస్సులను తప్పుడు ఆలోచనలతో నింపడానికి ప్రయత్నిస్తాడు, అతడు మనకు ఇవ్వడానికి ప్రయత్నించే వాటిని మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎవరైనా నాకు ఇచ్చారని నేను ఒక చెంచా విషాన్ని తీసుకోను మరియు మీరు కూడా తీసుకోరు. మనం విషాన్ని తిరస్కరించేంత తెలివిగలవారైతే, మన ఆలోచనలను, మన వైఖరిని మరియు చివరికి మన విధిని విషపూరితం చేయడానికి సాతానును అనుమతించకుండా మనం తెలివిగా ఉండాలి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ వైఖరి మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవడానికి రోజువారీ వైఖరి జాబితా చేయండి.