సహనముతో వేచి యుండుము

సహనముతో వేచి యుండుము

అయితే (పరిశుద్ధ) ఆత్మ ఫలమేమనగా (ఆయన సన్నిదితో సాధించే పని) …… దీర్ఘశాంతము, (సహన శక్తి, ఓర్పు)….. —గలతీ 5:22

మన జీవితాల్లో మనమందరము మార్పు చెందాలని ఆశిస్తాము, కానీ మనలను అక్కడికి తీసుకెళ్ళే ప్రక్రియను మనం ఎల్లప్పుడూ ఇష్టపడము. మనము ఆశించిన దానికంటే అది ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు మార్గములో వేచియుండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రశ్న ఏదనగా మనము సరియైన మార్గములో వెళ్తున్నామా లేక తప్పు మార్గములో వెళ్తున్నామా? మనము తప్పు మార్గములో వేచియున్నట్లైతే మనము కష్టాలలో పడతాము; కానీ మనము దేవుని మార్గములో నడచుటకు నిర్ణయించుకొనినట్లైతే మనము సహనమును కలిగి యుంటాము మరియు వాస్తవముగా అందులో ఆనందిస్తాము.

దీనికి అభ్యాసము అవసరము కానీ ప్రతి పరిస్థితిలో మనము దేవుని సహాయమును అనుమతించినట్లయితే, మనము సహాయమును పొందుకుంటాము మరియు అది క్రైస్తవ విలువలలో చాల ప్రాముఖ్యమైనది. సహనము అనునది ఆత్మ ఫలములో ఒక భాగము. అది కేవలం శోధనా కాలములోనే అభివృద్ధి చెందుతుంది, కాబట్టి మనము కష్ట పరిస్థితులలో పారిపోకూడదు. మనము సహనమును అభివృద్ధి చేసుకోనుచుండగా మనము చివరకు దేనిని కోల్పోకుండా – పూర్తిగా సంతృప్తిని పొందుకుంటాము (యాకోబు 1:2-4 వరకు చుడండి).

దేవునితో మన సంబంధములో అభివృద్ధికరమైన మార్పులను చూస్తాము. మనము ఆశించినంతకంటే ఎక్కువ సమయం వేచి యుండవలసిన అనేక అనుభవాలగుండా మనము వెళ్ళవలసి ఉంటుంది కనుక మనము ఆయన యందు లోతైన నమ్మకమును కలిగి యుండవలెను.

వేచియుండుట కష్టమే కానీ అది మిమ్మల్ని బలముగా చేస్తుందని నమ్మండి. సహనమును కలిగి యుండుటలోని ప్రయోజనములు వేచి యుండుటలోని అసౌకర్యమునకు ఖచ్చితముగా యోగ్యమైనవే!


ప్రార్ధనా స్టార్టర్

దేవా, నేను మారాలని మరియు మీతో నా సంబంధములో లోతుగా ఎదగాలని ఆశిస్తున్నాను. సహనమును అభివృద్ధి చేయుట దీని అర్ధమని నేను అర్ధం చేసుకున్నాను, కానీ మీరు నాలో సహనమును వృద్ధి చేయుచుండగా నేను బలముగా ఎదుగుతానని నాకు తెలుసు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon