“సాధారణ” విషయములను పరిశుద్ధ పరచుట

“సాధారణ” విషయములను పరిశుద్ధ పరచుట

ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. —రోమా 14:5

క్రీస్తు శిష్యులుగా, మన జీవితములన్నియు దేవునికి ఇవ్వవలెను మరియు అన్నిటిలో ఆయనకు ఇష్టులముగా ఉండవలెను (కొలస్సీ 1:10) అయినప్పటికీ మనము సాధారణముగా ఆలోచించుట అనగా అనుదిన బాధ్యతలు అనునవి ఆత్మీయ విషయాల కంటే విభిన్నమైనవని మరియు అవి పరిశుద్ధమైన వని మరియు దేవునితో యధార్ధముగా ఉండునట్లు మనము భావించునట్లు చేస్తాయని నమ్ముతాము.

మనము వాస్తవముగా సాధారణమైనది మరియు పరిశుద్ధమైన వాటి మధ్య తేడా ఏదియు లేదు మరియు అది మనస్సు మాత్రమే. మనము చేయు సమస్తము దేవునికి అర్పించవలెను; మరియు మనము దీనిని పరిశుద్ధ హృదయముతో చేస్తే అది పరిశుద్ధ మవుతుంది. మీరు కిరాణా దుకాణమునకు వెళ్ళుట వంటి సాధారణ పనులు చేయవచ్చు మరియు మీరు దానిని దేవునిని ఘనపరచే విధముగా చేసినట్లైతే అది ప్రార్ధన వంటి పవిత్రమైనదిగా ఉంటుంది.

ఈ విషయములో స్వేచ్చను ఇచ్చుటలు రోమా 14 బైబిల్ లోని ప్రశస్తమైన అధ్యాయము. 5-6 వచనములకు నా వ్యక్తిగత అనువాదమేదనగా ఒక వ్యక్తి ప్రార్ధనను మరియు బైబిల్ అధ్యయనమును పరిశుద్ధముగా చూస్తారు మరియు మరొకరు నిజముగా దేవునిలో స్వేచ్చగా ఉన్న వ్యక్తి అన్నిటినీ ఒకే విధముగా చూస్తాడు ఎందుకనగా అతడు ఏది చేసినా దేవునిని ఘనపరచుటకే చేస్తాడు.
మీరు కేవలం మీ జీవితములోని కొంత భాగము మాత్రమే దేవునికిచ్చుటకు బదులుగా మీరు చేసే సమస్తము దేవునికి అర్పనగా ఇవ్వాలని ఎంపిక చేసుకొనుము.


ప్రారంభ ప్రార్థన

దేవా, నా జీవితములో ఒక భాగము కాకుండా నా జీవితమంతయు పరిశుద్ధముగా ఉండాలని ఆశిస్తున్నాను. నా జీవితములోని ప్రతి కార్యమును నీకు సమర్పించుచున్నాను. నిన్ను ఘనపరచుటకే నేను జీవిస్తాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon